నేడు తొలి శ్రావణ సోమవారం... కాశీ విశ్వనాథుని ముంగిట జనం క్యూ!

ABN , First Publish Date - 2021-07-26T14:02:59+05:30 IST

ఈరోజు శ్రావణమాసంలోని తొలి సోమవారం. భక్తులతో...

నేడు తొలి శ్రావణ సోమవారం... కాశీ విశ్వనాథుని ముంగిట జనం క్యూ!

వారణాసి: ఈరోజు శ్రావణమాసంలోని తొలి సోమవారం. భక్తులతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. యూపీలోని వారణాసిలో విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు నిన్న రాత్రి నుంచే నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోతోంది. అయితే కారోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు విధించిన ఆంక్షలను పాటిస్తూ, భక్తులు మహాశివుణ్ణి దర్శించుకుని పూజలు, జలాభిషేకాలు చేస్తున్నారు. 


ప్రతీయేటా కాశీలో శ్రావణ సోమవారాల్లో భక్తుల తాకిడి నెలకొంటుంది. ఈసారి కరోనా నియమాల కారణంగా భక్తులను గర్భాలయంలోకి ప్రవేశం కల్పించడం లేదు. అలాగే స్పర్శ దర్శనాలను కూడా రద్దుచేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి సునీల్ వర్మ మాట్లాడుతూ శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుని ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నియమాలను తప్పక పాటించాలని సూచించారు. అయితే గత ఏడాది మాదిరిగానే గర్భాలయం బయట భక్తులు జలాభిషేకం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - 2021-07-26T14:02:59+05:30 IST