Abn logo
Jan 9 2021 @ 16:28PM

నెలలు నిండకనే పుట్టాడు... మీ సాయం కోసం చూస్తున్నాడు

"నేనెప్పుడూ నా కుటుంబ క్షేమం కోసమే ఎక్కువ ఆరాటపడుతుంటాను. నా కుటుంబానికి నా అవసరం వచ్చినప్పుడల్లా నా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన శక్తి ఇవ్వమని ఆ దేవుణ్ణి రోజూ కోరుకుంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే... ప్రతి క్షణం ఎన్ఐసీయూలో జీవితంతో పోరాడుతున్న నా పసిపాపణ్ణి ఆందోళనతో చూస్తూ ఆస్పత్రి ఆవరణలో ప్రార్థన చేస్తూ గడుపుతున్నాను..." అంటూ ఉబికి వస్తున్న కన్నీటితో వెంకట్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.


వెంకట్, హేమలత దంపతులకు 8 ఏళ్ళ కిందటే మొదటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్ని కుటుంబంలో మరో పసిపాపడికి స్వాగతం పలికి ఆనందాన్ని పంచుకుందామనుకున్న తరుణంలో విధి మరోలా తలచింది. హేమలత 8 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఒకరోజు ఉన్నట్టుండి తట్టుకోలేనంత కడుపు నొప్పికి గురైంది. డాక్టర్లు కొన్ని మందులు సూచించి త్వరగానే నొప్పి తగ్గుతుందని చెప్పారు కానీ, ఆమె ఆరోగ్యం క్రమంగా దిగజారుతూ వచ్చింది.


సాయం చేయడానికి క్లిక్ చేయండి

హేమలత భరించలేనంత నొప్పితో రోదిస్తుంటే భర్త వెంకట్ అమె పక్కనే ఉండి ఓదార్చుతున్నాడు. ఆమె శరీర ఉష్ణోగ్రత తీవ్రం కావడంతో పాటు రక్తస్రావం కూడా అవుతోంది. భార్య పరిస్థితి చూసిన వెంకట్ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆస్పత్రిలో చేర్చగానే డాక్టర్లు ఆమెకు చికిత్స ప్రారంభించారు. కొన్ని టెస్ట్‌‌లు చేసిన తర్వాత ఆమె పరిస్థితి గురించి వెంకట్‌కు వివరించారు. "హేమలత పరిస్థితి కష్టంగా ఉంది... ఆమెకు వెంటనే ప్రసవం చెయ్యకపోతే సమస్యలు ఇంకా ఎక్కవయ్యే ప్రమాదముంది" అని చెప్పారు.

డాక్టర్లు చెప్పింది వినగానే వెంకట్ గుండె చెదిరిపోయింది. జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తన భార్య క్షేమాన్ని కోరి అత్యవసరంగా ప్రసవం చెయ్యడానికి అంగీకరించాడు. సుదీర్ఘ వైద్య ప్రక్రియ అనంతరం ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. కానీ, నెలలు నిండక ముందే పుట్టినందువల్ల పిల్లవాడిని వెంటనే ఎన్ఐసీయూకి తరలించారు.


సాయం చేయడానికి క్లిక్ చేయండి


"నా కొడుకును ప్రతిరోజూ చూసుకుంటున్నాను. వాడు చక్కగా ఊపిరి తీసుకునేలా సహకరించేందుకు చుట్టూ బీప్ సౌండ్స్ చేస్తున్న ఎన్నో యంత్రాలున్నాయి. నర్సులు వాడి చేతికి సూదులు గుచ్చుతుంటే ఆ బాధ నేను అనుభవిస్తున్నాను. నా చిట్టి తండ్రికి ఎంతో చెయ్యాలనుకున్నాను. చేతుల్లోకి తీసుకుని లాలి పాటలు పాడాలనుకున్నాను. నీకేమీ కానివ్వనని చెప్పాలనుకున్నాను కానీ, నా చేతులు కట్టేసి ఉన్నాయి..." అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక వేదనగా చెప్పింది హేమలత.


ఈ చిన్ని కుటుంబం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పిల్లవాడి చికిత్సకయ్యే ఖర్చుల కోసం అమ్మానాన్నా కష్టపడుతుంటే... వారి పసికూన ప్రతి శ్వాసకూ పోరాటం చెయ్యాల్సి వస్తోంది. ఆ పసివాడి చికిత్సకు రూ.20,65,000 ఖర్చవుతుంది. పేద కుటుంబమైన వెంకట్, హేమలతలకు ఇది చాలా పెద్ద మొత్తం. భవన నిర్మాణ పనులు చేసుకునే వెంకట్‌కు వచ్చే ఆదాయం కేవలం అతని కుటుంబానికి సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప ఆ కుటుంబానికి సాయం చేసేవారెవరూ లేరు.


వెంకట్, హేమలత ఆశలన్నీ మీ అందరి పైనే ఉన్నాయి. మీ శక్తిమేరకు విరాళమిచ్చి వారి పసికందు వైద్యానికి సహకరించండి. వారి ఆశలు చితికిపోనియ్యకండి. 

సాయం చేయడానికి క్లిక్ చేయండి

Advertisement
Advertisement