వాట్సాప్‌ మీడియా సెట్టింగ్స్‌ చేంజ్‌తో స్టోరేజ్‌ స్పేస్‌ ఆదా

ABN , First Publish Date - 2021-07-31T06:14:22+05:30 IST

వాట్సాప్‌లో వచ్చిన ఫొటో, వీడియోలు డీఫాల్ట్‌గా గ్యాలరీలో వచ్చి చేరుతుంటాయి. దాంతో స్టోరేజ్‌ ప్రాబ్లమ్‌, స్పీడ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.

వాట్సాప్‌ మీడియా సెట్టింగ్స్‌ చేంజ్‌తో స్టోరేజ్‌ స్పేస్‌ ఆదా

వాట్సాప్‌లో వచ్చిన ఫొటో, వీడియోలు డీఫాల్ట్‌గా గ్యాలరీలో వచ్చి చేరుతుంటాయి. దాంతో స్టోరేజ్‌ ప్రాబ్లమ్‌, స్పీడ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. కంటెంట్‌ నుంచి ఫొటోల వరకు మరింత మెరుగ్గా నియంత్రించేందుకు మీడియా కంట్రోల్‌ సెట్‌ను వాట్సాప్‌ తెచ్చింది. ఇప్పుడు అన్ని చాట్‌ల ఆటో డౌన్‌లోడ్‌ను ఒకేసారి టర్న్‌ ఆఫ్‌ చేయొచ్చు.  దీని కోసం వాట్సాప్‌ కొత్త ఆప్షన్‌ ‘మీడియా విజిబిలిటీ’ని ఉంచుతోంది.  దీని కోసం వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌, యాక్టివ్‌ అకౌంట్‌ ఉండాలి. 


వాట్సాప్‌ తెరచి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి మూడు చుక్కలను టాపింగ్‌ చేయాలి. 

స్టోరేజ్‌ అండ్‌ డేటాని టాప్‌ చేసి, మీడియా ఆటో డౌన్‌లోడ్‌ సెక్షన్‌కు వెళ్ళాలి. 

ముందు ఈ మార్పులు చేయాలి. మొబైల్‌ డేటా వినియోగిస్తుంటే, బాక్స్‌లన్నీ అన్‌ చెక్‌ చేయాలి. వైఫైకి కనెక్ట్‌ అయి ఉన్నా, రోమింగ్‌లో ఉన్నా  కూడా అదే పని చేయాలి. ఈ మూడింటిలో ఏది బెస్ట్‌ అన్నది ఎంచుకోండి. 

సెట్టింగ్స్‌ - చాట్స్‌ - మీడియా విజిబిలిటీ టర్నాఫ్‌

ఇండివిడ్యువల్‌ కాంటాక్ట్స్‌ను ఆపేందుకు చాట్‌ పేరును పైన టాప్‌ చేసి మీడియా విజిబిలిటీని అప్పుడు టర్నాఫ్‌ చేస్తే సరిపోతుంది.  

Updated Date - 2021-07-31T06:14:22+05:30 IST