‘సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ’

ABN , First Publish Date - 2020-05-28T07:51:04+05:30 IST

వంద సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలో అతి పురాతనమైన వర్సిటీలో ఒకటి అయిన ఉస్మానియా వర్సిటీ నేడు భూ కబ్జాదారుల చేతులో చిక్కుకుంది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత...

‘సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ’

వంద సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలో అతి పురాతనమైన వర్సిటీలో ఒకటి అయిన ఉస్మానియా వర్సిటీ నేడు భూ కబ్జాదారుల చేతులో చిక్కుకుంది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన వర్సిటీలో ఉస్మానియా ఒకటి, నాటి నిజం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ నగరం విద్యకు కేంద్రంగా ఉండాలి అని భావించి నగరం నడి బొడ్డున సువిశాల స్థలంలో దాదాపుగా 3000 ఎకరాల్లో వర్సిటీని స్థాపించారు ఈ వందేళ్ళలో ఎంతో అభివృద్ధి చెంది నేడు 10,000 మంది విద్యార్థులకు చదువుల నిలయంగా మారింది అనేక మేధావులు, రాజకీయంగా విద్యార్థుల ఎదుగులకు కేంద్ర బిందువుగా మారిపోయింది నగరం మధ్యలో ఉండేసరికి భూ కబ్జాదారుల కన్ను ఓయూ పైన పడి వారి పరపతి, పలుబడి కారణంగాను, దానికితోడు వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ సహకారం లేని కారణంగాను ఓయూ భూమిని మొత్తం కోల్పోయింది 3000 ఎకరాలు ఉన్న భూమి నేడు 1200 వందల ఎకరాలకు వచ్చింది. ఉన్న భూమి కూడా విద్యార్థుల త్యాగ ఫలితంగానే మిగిలింది. లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు అందరూ కూడా ఇంటి బాట పట్టడంతో మరోసారి కబ్జా దారులు తులసి కాపారేటివ్ సొసైటీ పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కబ్జా దారులు వచ్చినపుడు విద్యార్థి సంఘాలకు, కబ్జాదారులకు యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది తప్పితే వర్సిటీ అధికారులు, ప్రభుత్వం తమకు ఏ మాత్రం సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వర్సిటీ భూమి రోజురోజుకూ తగ్గిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. వర్సిటీ భూమిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కోల్పోయిన భూమిని రీసర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలి. ఓయూ భూమికి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న తగాదాలు పరిష్కరించి ఓయూను కాపాడాలి.

చింత ఎల్లస్వామి

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు,

ఉస్మానియా యూనివర్సిటీ.

Updated Date - 2020-05-28T07:51:04+05:30 IST