మాజీ సైనికుడి భూమికి రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2021-03-05T05:13:11+05:30 IST

మాజీ సైనికుడి భూమికి రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు గురువారం తొట్టంబేడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.

మాజీ సైనికుడి భూమికి రక్షణ కల్పించండి
తొట్టంబేడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న బాధితులు

 పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా


శ్రీకాళహస్తి, మార్చి 4: మాజీ సైనికుడి భూమికి రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు గురువారం తొట్టంబేడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. బాధితులు ఇందిరమ్మ, గిరిజ, శ్రీదేవి కథనం మేరకు వివరాలిలా... తొట్టంబేడు మండలం కనపర్తి గ్రామా నికి చెందిన జగన్నాథంనాయుడు రెండవ ప్రపంచ యుద్దంలో  పాల్గొన్న మాజీ సైనికుడు. ఈయనకు భార్య ఇందిరమ్మ, కుమార్తెలు శ్రీదేవి, గిరిజ ఉన్నారు. పదవీవిరమణ అనంతరం జగన్నాథనాయుడికి ప్రభుత్వం తొట్టంబేడు మండలం కాసరం సర్వే నంబరు 426,427,428,429లో  15 ఎక రాల భూమి ఇచ్చింది. దానిని జనార్థననాయుడు తన కుమార్తెలకు రాసి ఇచ్చారు. తరువాత కొంతకాలానికి ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఇపుడు ఈ భూమి తమదంటూ కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తొట్టంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులకు అధికార పార్టీ నేతల అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని... ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-03-05T05:13:11+05:30 IST