Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 07 May 2022 19:07:39 IST

ఆ గుండె 15 ఏళ్ళుగా రోదిస్తోంది...

twitter-iconwatsapp-iconfb-icon

మా అమ్మాయి వయస్సు దుర్గా భవాని... 15 ఏళ్ళ వయస్సు. మా అమ్మాయికి కేవలం 3 సంవత్సరాల వయస్సు నుంచి అప్పుడప్పుడూ అనారోగ్యం బారిన పడుతుండేది. తల్లిదండ్రులుగా ఈనాటి మా వేదనకు అదే ప్రారంభం. భవాని తరచుగా తీవ్ర జ్వరానికి గురవుతూ అస్తమానూ అలసిపోతుండేది. ఎంత చిన్నపని చేసినా తను అలసటకు గురై పిచ్చిగా ప్రవర్తించేది. మా అమ్మాయి ఎందుకని ఇలాంటి పరిస్థితికి గరయ్యిందో తెలుసుకోవడానికి ఆమెను ఎందరో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాను.


కాని, జీవితం అనుకున్నంత సులువుగా గడవలేదు. నా భర్త దివ్యాంగుడు. మా కుటుంబానికి నేనే ఆధారం. నా ఇద్దరు పిల్లలు, నా భర్తను పోషించుకోవడానికి తగినంత సంపాదన కోసం నేను రోజంతా పనులకు వెళుతూనే ఉంటాను. ఏ కాస్త తీరిక సమయం దొరికినా ఇంటి పనులకే సరిపోతుంది. అలాంటి పరిస్థితిలో నేను దుర్గని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాను కానీ, ఆ డాక్టర్లు మా అమ్మాయి సమస్యని గుర్తించలేకపోయారు. ఇలా చాలాసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్లాం కానీ ఒక్కరూ అసలు సమస్యని పట్టుకోలేకపోయారు.


ఈ లింక్‌పై క్లిక్ చేసి దుర్గాభవానికి సాయం చెయ్యండి...

ఇలా కాలం గడుస్తుంటే.... మరోవైపు దుర్గ పరిస్థితి దిగజారిపోతోంది. ఆలసిపోతూ ఏడుస్తూనే ఉంది. మా పాపాయి ఆరోగ్యంగా ఉన్న రోజుల్ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. చివరికి, నెలల తరబడి వెదుకులాట తర్వాత నాకు తెలిసిందేంటంటే... దుర్గ పుట్టుక నుంచే ఉన్న గుండె జబ్బు ఉందని. దాని వల్ల ఆమె గుండె సరిగ్గా పని చెయ్యడం లేదు. మా అమ్మాయికి డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ సూచించారు. వారానికొకసారి చెకప్ కోసం రమ్మనేవారు. సర్జరీ చెయ్యాల్సి వస్తుందేమోనని కూడా అన్నారు.


మొదట్లో ఈ వైద్యానికయ్యే ఖర్చుల్ని నేను పొదుపు చేస్తూ వచ్చిన డబ్బుతో భరిస్తూ వచ్చాను. కుటుంబ పోషణ భారమవుతుండడంతో మరి కొంత పని అదనంగా చేస్తూ వచ్చేదాన్ని... ఏళ్లు గడుస్తున్న కొద్దీ మా కుటుంబానికి చిన్న చిన్న అవసరాల్ని కూడా తీర్చుకోవడం కష్టంగా మారింది. అదనంగా వచ్చే డబ్బు కూడా దాచుకునే పరిస్థితి లేదు. రోజువారీ ఖర్చులకు అయిపోయేది. దుర్గ వైద్యం... ఆస్పత్రులకు తిరగడం వల్ల డబ్బుకి చాలా ఇబ్బందయ్యింది. దుర్గకి ఇప్పుడు 15 సంవత్సరాలు నిండాయి. ఆమె పరిస్థితి ప్రాణాంతకంగా ఉంది. తను ఊపిరి తీసుకోవాలంటే వీలైనంత త్వరగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి.


ఈ లింక్‌పై క్లిక్ చేసి దుర్గాభవానికి సాయం చెయ్యండి...

దురదృష్టవశాత్తు ఇందుకు దాదాపుగా రూ.4,50,000 అంటే... 5932.40 డాలర్లు ఖర్చవుతుందని చెప్పారు. నా కలలో కూడా ఆ మొత్తాన్ని ఊహించలేను. దివ్యాంగుడైన భర్తని... అనారోగ్యానికి గురైన పాపని చూసుకోవడంతో పాటు రోజూ పనికి వెళ్లాలి. చెయ్యగలిగినంత చేస్తున్నాను. దుర్గని కాపాడుకోవడం నా ఒక్కదాని వల్ల కాదు. మీ సాయం కావాలి. సమయం మించిపోక ముందే సాయం చెయ్యమని కోరుకుంటున్నాను.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

చిత్రజ్యోతి Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.