కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-19T01:44:07+05:30 IST

చంద్రన్న బీమా పథకం ఉండి ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు బీమా వచ్చి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ మేరకు ఆర్థికసాయం అందించాలని గూడూరు, వెంకటగిరి టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

గూడూరు రూరల్‌, జూన్‌ 18: చంద్రన్న బీమా పథకం ఉండి ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు బీమా వచ్చి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ మేరకు  ఆర్థికసాయం అందించాలని గూడూరు, వెంకటగిరి టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద గూడూరు, వెంకటగిరి టీడీపీ నాయకులు  వేర్వేరుగా ధర్నా చేశారు.  కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ. 10 వేలు, ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందిన కుటుంభాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో గూడూరు టీడీపీ నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్‌రహీం, శివప్రసాద్‌, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, గురవయ్య, పిళ్లేల శ్రీనివాసులు, వెంకటగిరి టీడీపీ నాయకులు గంగాధర్‌, కోటేశ్వరరెడ్డి, మోహన్‌కృష్ణారెడ్డి, రాజగోపాల్‌నాయుడు, ఆనంద్‌, కేవీకే ప్రసాద్‌, సుధాకర్‌, చలపతి, మునీంద్ర, శశి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T01:44:07+05:30 IST