పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-06-15T05:18:33+05:30 IST

గ్రామాల్లో సర్పంచ్‌లు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎంపీడీవో ఎన్‌వివిఎస్‌ మూర్తి పిలుపు నిచ్చారు. స్వచ్ఛ శంఖారావం కార్యక్రమంలో భాగంగా పలు మండలాల్లోని సర్పంచ్‌లకు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో సోమవారం పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
కడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సర్పంచ్‌లు

  • ఎంపీడీవో ఎన్‌వివిఎస్‌ మూర్తి.. స్వచ్ఛ శంఖారావంపై కాన్ఫరెన్స్‌

రాజానగరం/కడియం, జూన్‌ 14: గ్రామాల్లో సర్పంచ్‌లు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎంపీడీవో ఎన్‌వివిఎస్‌ మూర్తి పిలుపు నిచ్చారు. స్వచ్ఛ శంఖారావం కార్యక్రమంలో భాగంగా పలు మండలాల్లోని సర్పంచ్‌లకు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో సోమవారం పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, పీఎస్‌ గోపాలకృష్ణద్వివేది, వివిధ జిల్లాల పం చాయతీ అధికారులు గ్రామాల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. దివంగత సీఎం వైస్‌ రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న గ్రామాల్లో తలపెట్టిన స్వచ్ఛ శంఖారావం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు, మొక్కలు నాటడం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సర్పంచ్‌లకు వివరించారు. కాగా రాజానగరం మండలంలో 22 మంది సర్పంచ్‌లు హాజరుకా వాల్సి ఉండగా, కొవిడ్‌ తదితర కారణాలతో పూర్తిస్థాయిలో హాజరుకాలేక పోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈవోపీఆర్డీ బొజ్జిరాజు పాల్గొన్నారు. కడి యంలో సర్పంచ్‌లు యాదల సతీష్‌చంద్రస్టాలిన్‌, కొండపల్లి పట్టియ్య, మార్గాని అమ్మాణి, ముద్రగడ సత్యస్వరూప, కొత్తపల్లి సత్యవతి, అయినవిల్లి రుక్మిణి, ఎంపీడీవో ఈ.మహేష్‌, ఈవోపీఆర్‌డీ వైవీఎన్‌ఎస్‌ లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:18:33+05:30 IST