సౌదీలో త‌గ్గిన రోజువారీ మ‌ర‌ణాల సంఖ్య...

ABN , First Publish Date - 2020-07-12T20:01:32+05:30 IST

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని సౌదీ అరేబియా విల‌విల‌లాడుతోంది. రోజురోజుకీ సౌదీలో ఈ మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తోంది.

సౌదీలో త‌గ్గిన రోజువారీ మ‌ర‌ణాల సంఖ్య...

రియాధ్‌: క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని సౌదీ అరేబియా విల‌విల‌లాడుతోంది. రోజురోజుకీ సౌదీలో ఈ మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తోంది. అయితే, చాలా రోజుల త‌ర్వాత శ‌నివారం రోజువారీ మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌డం కాస్తా ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఇంత‌కుముందు ప్ర‌తిరోజు 40 నుంచి 50 వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాగా... నిన్న కేవ‌లం 30 మ‌ర‌ణాలు మాత్ర‌మే సంభ‌వించాయి. ఇక శ‌నివారం ఒక్క‌రోజే 2,994 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా న‌మోదైన కొత్త కేసుల్లో అధికంగా రియాధ్‌(285), హౌఫ్(226), జెడ్డా(221), ద‌మ్మాం(211), తైఫ్‌(152) త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో సౌదీ వ్యాప్తంగా క‌రోనా సోకిన వారి సంఖ్య 2,29,480కు చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 2,370 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా వైర‌స్ నుంచి కోలుకున్న వారు 1,65,396 మంది అయ్యారు. ఇక నిన్న సంభ‌వించిన 30 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో మొత్తం 2,181 మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది.

Updated Date - 2020-07-12T20:01:32+05:30 IST