మహిళల విషయంలో Saudi Arabia మరో కీలక నిర్ణయం.. కొత్త శకానికి నాంది!

ABN , First Publish Date - 2022-01-04T18:45:35+05:30 IST

ఇప్పటికే మహిళల విషయంలో పలు కీలక నిర్ణయాలతో సౌదీ అరేబియా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మహిళల విషయంలో Saudi Arabia మరో కీలక నిర్ణయం.. కొత్త శకానికి నాంది!

రియాద్: ఇప్పటికే మహిళల విషయంలో పలు కీలక నిర్ణయాలతో సౌదీ అరేబియా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళలకు డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు, ప్రయాణాలు చేసేందుకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లాంటి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయంతో కొత్త శకానికి నాంది పలికేందుకు రెడీ అవుతోంది. రైల్వేలో కూడా వారిని భాగస్వామ్యం చేయబోతోంది. 2022 జనవరి 2న ప్రకటించిన సౌదీ రైల్వే పాలిటెక్నిక్(ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలను ట్రైన్స్ నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల మధ్య రైళ్లు నడపడమే ఈ ఎస్‌ఆర్‌పీ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశం. 


ఈ ట్రైన్స్ నడిపేందుకు మహిళలకు అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగా ఏడాది పాటు వారికి శిక్షణ ఇవ్వనుంది. జనవరి 15 నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. జెడ్డాలో దీనికి సంబంధించిన క్లాసులు ఉంటాయి. ట్రైనీలకు మెడికల్ ఇన్సూరెన్స్, జనరల్ ఆర్గనైజషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్‌లో రిజిస్ట్రేషన్, అలాగే ట్రైనింగ్ పీరియడ్‌లో 4వేల సౌదీ రియాల్(రూ.79వేలు) నెలవారీ బోనస్ వంటి పలు బెనిఫిట్స్ ఉంటాయి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి కేఎస్‌ఏ(హై స్పీడ్ ట్రైన్లు ఆపరేటింగ్ చేసే కంపెనీ)లో ఉద్యోగం గ్యారంటీ. ఇక సౌదీ అరేబియా రైల్వేస్‌లో ఉద్యోగంలో చేరిన తర్వాత మహిళ గ్రాడ్యుయేట్లకు 8వేల రియాళ్ల(రూ.1.58లక్షలు) నెలవారీ జీతం ఉంటుంది.   

Updated Date - 2022-01-04T18:45:35+05:30 IST