ట్రావెల్ బ్యాన్ దేశాల వారికి సౌదీ అరేబియా గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-08-14T13:59:23+05:30 IST

కరోనా నేపథ్యంలో ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల వారికి అరబ్ దేశం సౌదీ అరేబియా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల పౌరుల విజిట్ వీసాల చెల్లుబాటు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ పొడిగింపు ఆటోమెటిక్‌గా వర్తిస్తుందని, దీనికి ఎలాంటి రుసుము..

ట్రావెల్ బ్యాన్ దేశాల వారికి సౌదీ అరేబియా గుడ్‌న్యూస్!

రియాద్: కరోనా నేపథ్యంలో ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల వారికి అరబ్ దేశం సౌదీ అరేబియా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల పౌరుల విజిట్ వీసాల చెల్లుబాటు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ పొడిగింపు ఆటోమెటిక్‌గా వర్తిస్తుందని, దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. https://enjazit.com.sa/enjaz/extendexpiredvisa లింక్ ద్వారా వీసా గడువును పొడిగించుకోవచ్చని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ దేశాల నుండి సౌదీకి నేరుగా ప్రవేశాన్ని నిలిపివేసిన సమయంలో చెల్లుబాటు గడువు ముగిసిన విజిట్ వీసాదారులు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 


ఇక గత నెలలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్).. ఇకామా(రెసిడెన్సీ పర్మిట్), కింగ్డమ్‌కు వెలుపల ఉన్న ప్రవాసుల ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అలాగే విజిట్ వీసాల చెల్లుబాటును స్వయంచాలకంగా ఎలాంటి రుసుము లేకుండా ఆగస్టు 31కు పెంచింది. కాగా, సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో భారత్, పాకిస్థాన్, ఇండోనేసియా, ఈజిప్ట్, టర్కీ, అర్జెంటీనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఇథియోపియా, వియత్నాం, ఆఫ్ఘనిస్థాన్, లెబనాన్ ఉన్నాయి.  

Updated Date - 2021-08-14T13:59:23+05:30 IST