6 నెలలు కోమాలో ఉన్న భర్త.. తీరా కళ్లు తెరిచి చూస్తే.. భార్య చేసిన నిర్వాకంతో షాక్..!

ABN , First Publish Date - 2022-02-10T16:06:49+05:30 IST

రోడ్డు ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లిన భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది.

6 నెలలు కోమాలో ఉన్న భర్త.. తీరా కళ్లు తెరిచి చూస్తే.. భార్య చేసిన నిర్వాకంతో షాక్..!

దుబాయ్: రోడ్డు ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్లిన భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది. ఆరు నెలల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చిన వ్యక్తి తన భార్య చేసిన నిర్వాకం తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. తనకు విడాకులు ఇచ్చి మరీ భార్య మరో వ్యక్తిని పెళ్లాడిందని తెలియడంతో అతని బాధ వర్ణణాతీతం. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఘటన ఓ రేడియో ఇంటర్వ్యూ ద్వారా తాగాజా బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే... సౌదీలో ఉండే ఓ వ్యక్తికి అరబ్ మహిళతో వివాహమైంది. అయితే, వారి పరిణయం సాధారణంగా జరిగింది కాదు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతను పెద్ద త్యాగమే చేశాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేయడంతో పాటు అతను నివాసం ఉంటున్న చోటును కూడా మార్చాడు. చివరకు ఎలాగోలా ఆమెను వివాహం చేసుకున్నాడు. 


కానీ, సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ రోడ్డు ప్రమాదం ఊహించని మలుపుకు కారణమైంది. ఒకరోజు పని నిమిత్తం బయటకు వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. దాంతో తీవ్రంగా గాయపడిన అతను కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు కూడా అతను ఎప్పుడు కోమాలోంచి బయటకు వచ్చేది చెప్పాలేమని చేతులెత్తేశారు. అంతే.. భర్త 'క్లినికల్ డేడ్' అనే సాకు చూపి రెండు నెలల తర్వాత భార్య విడాకులు తీసుకుంది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఆరు నెలల కోమాలో ఉన్న వ్యక్తి నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తీరా చూస్తే భార్య పక్కన లేదు. కుటుంబ సభ్యులను అడిగితే షాకింగ్ విషయం చెప్పారు. 


కోమాలోకి వెళ్లిన రెండు నెలలకే భార్య అతడ్ని వదిలేసి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అది విన్న భర్తకు గుండె పగిలినంత పనైంది. తాను చేస్తున్న జాబ్, ఉంటున్న చోటును వదిలేసి భార్య కోసం వస్తే ఆమె చేసిన నిర్వాకం ఇదంటూ తాజాగా రేడియో ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి తన గోడును వెళ్లబోశాడు. తాను కోమాలో ఉన్న సమయంలో తనను క్లినికల్‌గా చనిపోయినట్లు చెప్పి విడాకులు తీసుకుని మరీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనను చాలా బాధ పెట్టిందని తెలిపాడు. ఈ బాధాకరమైన అనుభవం ఫలితంగా తాను ఇప్పుడు బలమైన మానసిక గాయంతో బాధపడుతున్నానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.    

Updated Date - 2022-02-10T16:06:49+05:30 IST