మక్కా మసీదులోకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్ !

ABN , First Publish Date - 2020-10-31T13:15:42+05:30 IST

సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ప్రమాద వశాత్తు ఓ కారు దూసుకెళ్లింది.

మక్కా మసీదులోకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్ !

మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ప్రమాద వశాత్తు ఓ కారు దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సౌదీ పౌరుడు ఒకరు ఓవర్ స్పీడ్‌తో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. లోపలికి దూసుకొచ్చిన కారు అక్కడ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బారికేడ్లను దాటుకుని వెళ్లి మసీదు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. గ్రాండ్ మసీదు దక్షిణం వైపు ఉన్న రోడ్లలో ఒకదానిపై కారు డ్రిఫ్టింగ్, అతివేగంతో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-10-31T13:15:42+05:30 IST