ఇండియా విమానాలను నిషేధించిన సౌదీ

ABN , First Publish Date - 2020-09-24T16:13:11+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్నందున భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ మేరకు సౌదీ అరేబియాస్‌ జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(జీఏసీఏ)

ఇండియా విమానాలను నిషేధించిన సౌదీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: కరోనా కేసులు పెరుగుతున్నందున భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ మేరకు సౌదీ అరేబియాస్‌ జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(జీఏసీఏ) బుధవారం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇండియాతోపాటు బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాలకు చెందిన విమానాలను కూడా నిషేధించింది. అయితే అధికారికంగా ప్రభుత్వ ఆహ్వానాలున్న ప్రయాణికులను మాత్రం ఈ నిషేఽ దం నుంచి మినహాయించారు. కాగా, ఐదు రోజుల క్రితం ఇద్దరు పాజిటివ్‌లు ప్రయాణించారనే కారణంతో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను 24 గంటలపాటు దుబాయ్‌ పౌర విమానయాన సంస్థ అధికారులు నిషేధించారు. శనివారం నుంచి ఈ విమానాలను తిరిగి పునరుద్ధరించారు.

Updated Date - 2020-09-24T16:13:11+05:30 IST