Saudi Arabia: వేల కోట్ల విలువైన విమానాన్ని తుక్కు కింద అమ్మేసిన రాజ కుటుంబం

ABN , First Publish Date - 2022-05-05T09:46:02+05:30 IST

వేల కోట్ల విలువైన ఒక విలాసవంతమైన విమానం కొని దానిని ఉపయోగించకుండానే తుక్కు కింద అమ్మేసింది ఒక రాజ కుటుంబం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలో అత్యంత సంపన్నుల రాజకుటుంబాల్లో సౌదీ రాజ కుటుంబం కూడా ఒకటి. ఆ రాజకుటుంబం పదేళ్ల కిందట రెండు వేల కోట్లు రూపాయలతో...

Saudi Arabia: వేల కోట్ల విలువైన విమానాన్ని తుక్కు కింద అమ్మేసిన రాజ కుటుంబం

వేల కోట్ల విలువైన ఒక విలాసవంతమైన విమానం కొని దానిని ఉపయోగించకుండానే తుక్కు కింద అమ్మేసింది ఒక రాజ కుటుంబం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలో అత్యంత సంపన్నుల రాజకుటుంబాల్లో సౌదీ రాజ కుటుంబం కూడా ఒకటి. ఆ రాజకుటుంబం పదేళ్ల కిందట రెండు వేల కోట్లు రూపాయలతో కొన్న విమానాన్ని గత నెల తుక్కు కింద అమ్మేసింది.


వివరాల్లోకి వెళితే..  2012 సంవత్సరంలో సౌదీ అరేబియా దేశ రాజు అయిన సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ బోయింగ్ సంస్థకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ విమానం అయిన "బోయింగ్ 747-8"ని కొనేందుకు ఆర్డర్ చేశారు. దాంట్లో అన్ని విలాసమంతమైన అన్ని సౌకర్యాలు ఉండేందుకు $295 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.2,254 కోట్లుపైమాటే) ఖర్చు చేశారు. ఈ విమానాన్ని ఆయన తన వ్యక్తిగత ప్రయాణాల కోసం వినియోగించాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ విమానం రాజుగారి వద్దకు చేరేలోపే ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి ఆ విలాసవంతమైన విమానం ఎవరూ ఉపమోగించకుండా అలానే పక్కన పెట్టారు. ఆ విమానం గత పదేళ్లుగా స్విట్జర్లాండ్ లోని బాసెల్ నగరంలోనే ఉండిపోయింది.


ఇంత భారీ విమానం పదేళ్లుగా నిరుపయోగంగా పడిఉండడం గమనించిన బోయింగ్ సంస్థ దానిని తిరిగి తామే కొనుగోలు చేస్తామని చెప్పింది. ఆ తరువాత గత నెలలో సౌదీ రాజ కుటుంబం నుంచి తిరిగి విమానాన్ని తుక్కు కింద(స్క్రాప్) కొనుగోలు చేసింది. ఆ విమానాన్ని గత ఏప్రిల్ 15న అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న పీనల్ ఎయిర్‌పార్క్ కి తరలించింది. ప్రపంచంలో పనికిరాని తుక్కు విమానాలను అరిజోనా పీనల్ ఎయిర్‌పార్క్‌కు తీసుకువచ్చి.. వాటిని భాగాలుగా విడగొట్టి మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తారు.


అయితే 2012కి ముందు ఈ 747-8 విమానాన్ని కొనుగోలు చేసిన అప్పటి సౌదీ రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ తన అభిరుచికి తగ్గట్టుగా తీర్చి దిద్ధించాడు. సుమారు $295 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.2,254 కోట్లుపైమాటే) వెచ్చించి కొనుగోలు చేసిన ఈ విమానంలో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. అయితే విమానం ఆర్డర్ చేసి డెలివరీ అందుకునేలోపే..రాజు ‘సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ 2012లో మృతి చెందారు. రాజు పేరుపైనే ఉన్న ఈ విమానాన్ని ఏం చేయాలో తెలియక రాజు కుటుంబీకులు సైతం పట్టించుకోలేదు. దీంతో ఈ ‘బోయింగ్ 747-8″ 2012 నుంచి స్విట్జర్లాండ్ లోని బాసెల్ నగరంలోనే ఉండిపోయింది. ఇంత భారీ విమానం పదేళ్లుగా ఎవరు వాడకపోవడంతో ఈ విమానాన్ని తిరిగి తామే కొనుగోలు చేసి ఉపయోగించాలని బోయింగ్ సంస్థ భావించింది.


ఆమేరకు గత నెలలో సౌదీ రాజ కుటుంబం నుంచి తిరిగి విమానాన్ని తుక్కు కింద(స్క్రాప్) కొనుగోలు చేసిన బోయింగ్ సంస్థ.. ఏప్రిల్ 15న అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న పీనల్ ఎయిర్‌పార్క్ కి తరలించింది. ప్రపంచంలో పనికిరాని తుక్కు విమానాలను ఇక్కడికే తరలించి..పార్టులుగా విడగొట్టి మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తారు. కాగా బోయింగ్ 747 సిరీస్ లో సంస్థ తయారు చేసిన చివరి విమానం కూడా ఇదే కావడం గమనార్హం. 1970లో మొదటిసారి 747 సిరీస్ విమానాలు తయారు చేయడం ప్రారంభించింది బోయింగ్ సంస్థ.


Read more