సౌదీలో ఆగ‌ని క‌రోనా క‌ల్లోలం.. ఒకేరోజు 4,207 కేసులు

ABN , First Publish Date - 2020-07-07T15:31:29+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది.

సౌదీలో ఆగ‌ని క‌రోనా క‌ల్లోలం.. ఒకేరోజు 4,207 కేసులు

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. అంత‌కంత‌కు కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమ‌వారం కూడా సౌదీలో 4,207 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ వారి సంఖ్య 2,13,716కు చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 4,398 మంది కోవిడ్ పేషెంట్స్ కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,49,634 మంది కోలుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. ఇక సోమ‌వారం సంభ‌వించిన 52 మ‌ర‌ణాల‌తో క‌లిపి సౌదీ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,968 మంది క‌రోనాతో ప్రాణాలొదిలారు. మ‌రో  62,114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2,254 కేసులు క్రిటిక‌ల్ స్టేజ్‌లో ఉన్న‌ట్లు సౌదీ ఆరోగ్య‌శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌యం కొన‌సాగిస్తున్న మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5.30 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. కోటి 17 లక్ష‌ల మంది బాధితులు ఉన్నారు.     

Updated Date - 2020-07-07T15:31:29+05:30 IST