సౌదీలో ఒకేరోజు 2,591 క‌రోనా కేసులు...

ABN , First Publish Date - 2020-06-06T18:39:31+05:30 IST

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని గ‌ల్ఫ్ దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈ, కువైట్‌లో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది.

సౌదీలో ఒకేరోజు 2,591 క‌రోనా కేసులు...

రియాధ్‌: క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని గ‌ల్ఫ్ దేశాలు విల‌విల‌లాడుతున్నాయి. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈ, కువైట్‌లో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది. సౌదీ అరేబియాలో శుక్ర‌‌వారం ఒక్క‌రోజే 2,591 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా న‌మోదైన కొత్త కేసుల్లో అధికంగా రియాధ్‌ (459), జెడ్డా (254), మక్కా (129), మదీనా (102) త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలియ‌జేశారు. దీంతో సౌదీలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య‌ 95,748కి చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 1,651 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న వారి సంఖ్య 70,616కు చేరింది. కాగా, శుక్ర‌వారం సంభ‌వించిన 31 మ‌ర‌ణాల‌తో క‌లిపి సౌదీలో 642 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. మ‌రో 24,490 మంది దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 1,412 బాధితుల ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, మొత్తం క‌రోనా కేసుల్లో 54 శాతం ప్ర‌వాసులు ఉండ‌గా, మిగిలిన 46 శాతం సౌదీ పౌరులు ఉన్నారు.  

Updated Date - 2020-06-06T18:39:31+05:30 IST