సౌదీలో 90వేలు దాటిన క‌రోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-06-05T18:52:15+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.

సౌదీలో 90వేలు దాటిన క‌రోనా కేసులు..!

రియాధ్‌: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. రోజురోజుకీ శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న‌ కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. గురు‌వారం ఒక్క‌రోజే సౌదీలో 1,975 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 93,157కి చేరిందని ఆ దేశ ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. కాగా, కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అధికంగా రియాధ్ (675), జెడ్డా (259), మక్కా (286), మ‌దీనా (124) త‌దిత‌ర ప్రాంతాల్లో న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. నిన్న 806 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వైర‌స్ నుంచి కోలుకున్న వారు  68,965 మంది అయ్యారు. అలాగే గురువారం సంభ‌వించిన 32 మ‌ర‌ణాల‌తో క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కూ ఆ దేశంలో 611 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. 

Updated Date - 2020-06-05T18:52:15+05:30 IST