సౌదీలో అంత‌కంత‌కు పెరుగుతున్న రిక‌వరీలు !

ABN , First Publish Date - 2020-08-13T19:34:28+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. అంత‌కంత‌కు రిక‌వ‌రీలు పెర‌గుతున్నాయి.

సౌదీలో అంత‌కంత‌కు పెరుగుతున్న రిక‌వరీలు !

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. అంత‌కంత‌కు రిక‌వ‌రీలు పెర‌గుతున్నాయి. అదే స‌మ‌యంలో పాజిటివ్ కేసులు త‌గ్గుతున్నాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 1,569 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,93,037కు చేరింది. కాగా, నిన్న ఒక్క‌రోజే 2,151 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రిక‌వరీలు 2,57,269 అయ్యాయి. ఇక బుధ‌వారం సంభ‌వించిన 36 మర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 3,269 మందిని ఈ వైర‌స్ క‌బ‌ళించింది. అలాగే ప్ర‌స్తుతం దేశంలో 32,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 1,826 కేసులు క్రిటిక‌ల్ స్టేజ్‌లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనా ఇప్ప‌టికే 7.427 ల‌క్ష‌ల మందిని బ‌లిగొంది. అలాగే రెండు కోట్ల 8 లక్ష‌ల మందికి ప్ర‌బ‌లింది.   

Updated Date - 2020-08-13T19:34:28+05:30 IST