సౌదీలో అంత‌కంత‌కు పెరుగుతున్న రిక‌వరీలు !

ABN , First Publish Date - 2020-08-11T15:14:12+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది.

సౌదీలో అంత‌కంత‌కు పెరుగుతున్న రిక‌వరీలు !

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. సోమ‌వారం సౌదీలో 1,257 పాజిటివ్ కేసులు న‌మోదైతే... 1,439 రిక‌వ‌రీలు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,89,947కు చేరితే... మొత్తం రిక‌వ‌రీలు 2,53,478 అయ్యాయి. అలాగే నిన్న సంభ‌వించిన 32 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టికే 3,199 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 33,270 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 1,824 కేసులు క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ వైర‌స్ ఇప్ప‌టికే 7.38 ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. దాదాపు రెండు కోట్ల మంది బాధితులు ఉన్నారు.     

Updated Date - 2020-08-11T15:14:12+05:30 IST