Burj Khalifa ను తలదన్నెలా జంట కట్టడాలకు Saudi భారీ స్కెచ్.. వ్యయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ABN , First Publish Date - 2022-06-02T18:52:08+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా భారీ జంట భవనాల నిర్మాణాలకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

Burj Khalifa ను తలదన్నెలా జంట కట్టడాలకు Saudi భారీ స్కెచ్.. వ్యయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

50 వేల కోట్ల డాలర్ల వ్యయంతో భారీ జంట కట్టడాలు

రియాద్‌: అరబ్ దేశం సౌదీ అరేబియా భారీ జంట భవనాల నిర్మాణాలకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం Burj Khalifa తో యూఏఈ ప్రపంచ దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు దాన్ని తలదన్నేలా ప్రపంచంలోనే అత్యంత భారీ జంట కట్టడాల నిర్మాణానికి Saudi Arabia ప్రణాళిక రచిస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కలల నగరమైన నియోమ్‌ (NEOM)లో వీటిని నిర్మించనున్నారు. ఇందులో ఒక్కొక్క ఆకాశ హర్మ్యం ఎత్తు 500 మీటర్లు ఉండనుందట. ఇది బుర్జ్‌ ఖలీఫా ఎత్తు(829 మీటర్లు- 2,717ఫీట్లు)తో పోలిస్తే తక్కువే. కానీ విస్తీర్ణం మాత్రం పదుల మైళ్ళు ఉండనుంది. ఈ సందర్భంగా నియోమ్ అధికారులు మాట్లాడుతూ.. ఈ జంట కట్టడాల ఎత్తులో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు గానీ, వెడల్పు మాత్రం ఊహించనంత ఉండనుంది. తుదిరూపు ఇంజినీరింగ్‌ నిపుణుల అభిప్రాయాల మేర రూపొందించడం జరుగుతుందని అన్నారు. 


ఇక NEOM ను యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లో తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యపరిచే ఉద్దేశంలో భాగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అత్యాధునిక హంగులతో స్టార్‌వార్స్‌లోని వకాండా తరహాలో నిర్మితమవుతున్న కృత్రిమ స్మార్ట్‌ నగరం. ఎర్రసముద్ర తీరంలో 170 కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ నగరానికి.. ఈ జంట బాహుబలి బిల్డింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ జంట భారీ భవనాల నిర్మాణానికి Saudi Arabia భారీగానే వెచ్చించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వ్యయం సుమారు 50వేల కోట్ల డాలర్లు అని తెలుస్తోంది. 

Updated Date - 2022-06-02T18:52:08+05:30 IST