Five-star hotel: పెట్స్ కోసం ఫైవ్‌స్టార్ హోటల్.. ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2022-08-11T17:40:47+05:30 IST

ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులను ఇళ్లలో ఒంటరిగా వదిలి వెళ్లడం చాలామందికి అంతగా నచ్చదు. ఎక్కువ మంది తమతో పాటు తీసుకెళ్లేందుకే ఇష్టపడుతుంటారు.

Five-star hotel: పెట్స్ కోసం ఫైవ్‌స్టార్ హోటల్.. ఎక్కడంటే..!

రియాద్: ఎంతో ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులను ఇళ్లలో ఒంటరిగా వదిలి వెళ్లడం చాలామందికి అంతగా నచ్చదు. ఎక్కువ మంది తమతో పాటు తీసుకెళ్లేందుకే ఇష్టపడుతుంటారు. కానీ, అన్ని చోట్లకు అలా తమతో పాటు పెట్స్‌ను తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో కుదరదు. దాంతో తప్పనిపరిస్థితుల్లో వాటిని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి వెళ్తుంటారు. ఇలా ఇంట్లో తమ పెట్స్‌ను ఒంటరిగా వదిలి వచ్చామే అని బాధపడే వారి కోసం సౌదీ అరేబియాలో ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. ఏకంగా పెట్స్ కోసం ఓ ఫైవ్‌-స్టార్ హోటల్‌నే తెరిచేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ హోటల్‌లో కేవలం పిల్లులకు మాత్రమే అనుమతి ఉంది. బయటకు పనిపై వెళ్లేవారు, షాపింగ్, వేరే ఊరికి వెళ్లే సమయంలో  పెట్స్ ఓనర్లు ఇక్కడ తమ క్యాట్స్‌ను వదిలి వెళ్లొచ్చు. గంటలు, రోజుల వరకు ఇక్కడ ఉంచే వెసులుబాటు ఉంది. 


అలా యజమానులు వదిలివెళ్లిన పిల్లులను అక్కడి సిబ్బంది ఆహారం పెట్టడం, ఆడించడం వంటివి చేస్తారు. ఇక అక్కడ తమ పెట్స్ ఎలా ఉన్నాయో అనే బెంగ యజమానులకు ఉంటుంది. అందుకే వాటికి సంబంధించిన అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు అందించేందుకు పెట్స్ ఓనర్ల కోసం హోటల్ యాజమాన్యం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను క్రియేట్ చేసింది. ఈ యాప్ ద్వారా హోటల్‌లో తమ పెట్స్‌ను నేరుగా చూసుకోవడం, వివరాలు తెలుసుకోవడం లాంటి సౌకర్యాలను హోటల్ యాజమాన్యం కల్పించింది. పెట్స్‌కు ఈ హోటల్ ఒక రిసార్ట్‌లా ఉంటుందని యజమాని హుదా అల్ ఒతైబీ తెలిపారు. సౌదీలోనే ఇది ఫస్ట్ పెట్ హోటల్‌ అని, పిల్లులను ఇష్టపడేవారు చాలా మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారని ఒతైబీ చెప్పారు.   




Updated Date - 2022-08-11T17:40:47+05:30 IST