Saudi Arabia: విదేశీ విద్యార్థులకు సౌదీ శుభవార్త.. స్పాన్సర్స్ అవసరం లేకుండానే..

ABN , First Publish Date - 2022-09-29T13:42:14+05:30 IST

సౌదీ అరేబియా విదేశీ విద్యార్థుల (Foreign students)కు శుభవార్త చెప్పింది. స్పాన్సర్స్ అవసరం లేకుండానే ఎడ్యుకేషనల్ వీసాలు (Educational visas) ఇస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా ఆ దేశ కేబినెట్ కొత్త విద్యా వీసాలను ప్రవేశపెట్టింది. వీటిలో దీర్ఘకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఇవ్వనున్నారు. విద్యా ప్రయోజనాల కోసం..

Saudi Arabia: విదేశీ విద్యార్థులకు సౌదీ శుభవార్త.. స్పాన్సర్స్ అవసరం లేకుండానే..

రియాద్: సౌదీ అరేబియా విదేశీ విద్యార్థుల (Foreign students)కు శుభవార్త చెప్పింది. స్పాన్సర్స్ అవసరం లేకుండానే ఎడ్యుకేషనల్ వీసాలు (Educational visas) ఇస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా ఆ దేశ కేబినెట్ కొత్త విద్యా వీసాలను ప్రవేశపెట్టింది. వీటిలో దీర్ఘకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఇవ్వనున్నారు. విద్యా ప్రయోజనాల కోసం కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిమండలి వెల్లడించింది. మంగళవారం రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ (King Salman) అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 


ఇక స్వల్పకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, విజిటింగ్ ట్రైనీలకు భాషా అధ్యయనం, శిక్షణ, షార్ట్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడంతో పాటు విద్యార్థి మార్పిడి కార్యక్రమాల ప్రయోజనాల కోసం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రిమండలి ప్రకటించింది. ఇదిలాఉంటే.. సుమారు 13 మిలియన్ల మంది ప్రవాసులు(Expats) ఉన్నర సౌదీ అరేబియా (Saudi Arabia)లో పని చేయాలనుకునే విదేశీయుడి ప్రవేశానికి సౌదీ స్పాన్సర్ తప్పనిసరి. అయితే, కాంట్రాక్టు నిబంధనలను మెరుగుపరిచే ఉద్దేశంతో 2021లో చాలా వృత్తులవారికి ఆ షరతును కింగ్‌డమ్ (Kingdom) రద్దు చేసింది.

Updated Date - 2022-09-29T13:42:14+05:30 IST