టీకా వేయించుకోని.. విదేశీ సందర్శకులపై సౌదీ ప్రత్యేక ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-11T14:20:23+05:30 IST

టీకా తీసుకోని విదేశీ సందర్శకులపై సౌదీ అరేబియా ప్రత్యేక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఆమోదం పొందిన హోటళ్లు, ఇతర చోట్ల ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి చేసింది.

టీకా వేయించుకోని.. విదేశీ సందర్శకులపై సౌదీ ప్రత్యేక ఆంక్షలు

రియాద్: టీకా తీసుకోని విదేశీ సందర్శకులపై సౌదీ అరేబియా ప్రత్యేక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఆమోదం పొందిన హోటళ్లు, ఇతర చోట్ల ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి చేసింది. మే 20 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీఏసీఏ) సోమవారం వెల్లడించింది. సౌదీ పౌరులు, విమాన సిబ్బంది, దౌత్యవేత్తలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఏర్పాట్ల కోసం విమానయాన సంస్థలు పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయం తీసుకోవాలని పేర్కొంది. ఈ క్వారంటైన్‌కు అయ్యే ఖర్చులను విమాన టికెట్‌ ధరతో కలిపి తీసుకోవాలని సూచించింది. రెండు డోసుల టీకా పూర్తి చేసుకున్న ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తైనట్లు ధృవపత్రం చూపిస్తే వారికి క్వారంటైన్ అవసరం లేదు. అలాగే ఎనిమిదేళ్లకు పైబడిన నాన్-సౌదీ ప్రయాణికులు జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం కూడా తప్పనిసరి.  

Updated Date - 2021-05-11T14:20:23+05:30 IST