రంజాన్‌పై సౌదీ కీల‌క ప్ర‌క‌ట‌న !

ABN , First Publish Date - 2021-05-12T14:40:07+05:30 IST

రంజాన్ పండుగ‌పై సౌదీ అరేబియా సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

రంజాన్‌పై సౌదీ కీల‌క ప్ర‌క‌ట‌న !

రియాద్: రంజాన్ పండుగ‌పై సౌదీ అరేబియా సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గురువారం నాడు పండుగ తొలిరోజుగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌క‌టించింది. ష‌వ్వాల్‌కు గుర్తింపుగా చెప్పుకునే చంద్ర‌వంక మంగ‌ళ‌వారం క‌నిపించలేద‌ని మూన్ సైట్నింగ్ క‌మిటీ పేర్కొంది. దీంతో బుధ‌వారం నాడు ఉపవాసాల‌కు(రోజాల‌కు) చివ‌రి రోజుగా వెల్ల‌డించింది. గ‌త‌ 30 రోజులుగా చేస్తున్న ఉపవాసాలు బుధ‌వారంతో ముగుస్తాయని స్ప‌ష్టం చేసింది. అందుకే మే 13న‌(గురువారం) ఈద్ అల్ ఫిత‌ర్‌(రంజాన్‌) జ‌రుపుకోవాల‌ని నిర్ణ‌యించింది. అటు ఖ‌తార్ కూడా ఇదే రోజున పండుగ జ‌రుపుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించింది.    

Updated Date - 2021-05-12T14:40:07+05:30 IST