Saudi Arabia వెళ్లేవారికి గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-06-14T15:08:28+05:30 IST

సౌదీ అరేబియా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. మహమ్మారి కరోనా కట్టడికోసం విధించిన అన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది.

Saudi Arabia వెళ్లేవారికి గుడ్‌న్యూస్

రియాద్: సౌదీ అరేబియా వెళ్లేవారికి గుడ్‌న్యూస్. మహమ్మారి కరోనా కట్టడికోసం విధించిన అన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. కోవిడ్-19 నివారణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా అధికారులు సోమవారం కీలక ప్రకటన చేశారు. తాజాగా ఎత్తివేసిన చర్యలలో గ్రాండ్ మసీదు, ప్రొఫెట్ మసీదు మినహా మూసి ఉన్న ప్రదేశాలలో ఫేస్‌మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.


సౌదీ అరేబియా ఎత్తివేసిన ఆంక్షలివే:

గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదు, పబ్లిక్ హెల్త్ అథారిటీ ద్వారా ప్రోటోకాల్‌లు జారీ చేయబడిన ప్రదేశాలు మినహా మూసి ఉన్న ప్రదేశాలలో ఫేస్‌మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ప్రజా రవాణా అధికారులు ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవచ్చు. సౌకర్యాలు, కార్యకలాపాలు, ఈవెంట్‌లు, విమాన బోర్డింగులు, ప్రజా రవాణాలో ప్రవేశించడానికి తవాకుల్నా అప్లికేషన్‌లో టీకాలు తీసుకోవడం, ఆరోగ్య ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, సాధారణ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వారి ఆరోగ్య స్థితిని ధృవీకరించడం కొనసాగించడం జరిగింది. ఇక కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్(మూడో టీకా) తీసుకోవాల్సిన వ్యవధి రెండో డోస్ తీసుకున్న మూడు నెలలకు బదులుగా ఎనిమిది నెలల వరకు తీసుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


 

Updated Date - 2022-06-14T15:08:28+05:30 IST