Advertisement
Advertisement
Abn logo
Advertisement

టూరిస్ట్, విజిట్ వీసాదారులకు సౌదీ గోల్డెన్ ఛాన్స్!

దుబాయ్: టూరిస్ట్, విజిట్ వీసాలపై సౌదీ అరేబియాలో ఉన్న ముస్లింలకు అక్కడి ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. టూరిస్ట్, విజిట్ వీసాదారులను ఉమ్రాకు అనుమతి ఇచ్చింది. అయితే, మొదట యాత్రికులు ఈతమార్న, తవక్కల్నా యాప్‌లలో దీనికి అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఉమ్రా పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు హజ్, ఉమ్రా మినిస్ట్రీ తాజాగా కీలక ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని టూరిస్ట్ లేదా విజిట్ వీసాలపై కింగ్‌డమ్‌కు వస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, ఈతమార్న యాప్‌లో రిజిస్ట్రేషన్ ద్వారా ఉమ్రా పర్మిట్ పొందవచ్చని తెలిపింది. అయితే, ఈతమార్న‌లో అకౌంట్ క్రియేట్ చేసేందుకు తవక్కల్నా యాప్‌లో విజిటర్‌కు సంబంధించిన ఇమ్యూన్ హెల్త్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి.  


ఇవి కూడా చదవండి..

Saudi నుంచి వచ్చిన విమానం.. ఓ ప్రయాణికుడిని కారులో వెంబడించిన పోలీసులు.. క్రైమ్ సినిమా స్టోరీ తరహాలో..

Kuwait వెళ్లాలా? ఇంకేందుకు ఆలస్యం లగేజీ సర్దుకోండి!


రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు లేదా మొదటి డోసు తీసుకుని 14 రోజులు పూర్తి అయిన వారికి మాత్రమే ఇమ్యూన్ స్టేటస్ అప్‌డేటింగ్‌కు వీలు ఉంటుందని మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారు సైతం ఉమ్రా పర్మిట్‌కు అర్హులని పేర్కొంది. ఇప్పటికే 500 ఉమ్రా సేవా సంస్థలు, 6,000 విదేశీ ఉమ్రా ఏజెంట్లు టీకాలు తీసుకున్న విదేశీ ఉమ్రా యాత్రికులను ఆగస్టు 9 నుంచి స్వీకరించడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం అందుబాటులో ఉన్న 30 ఎలక్ట్రానిక్ సైట్‌ల ద్వారా యాత్రికులు ఉమ్రా ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందు వివిధ ఇస్లామిక్ దేశాలతో అంగీకరించిన కోటా ప్రకారం ఎక్కువ మంది ఉమ్రా యాత్రికులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement