Saudi Arabia: 18ఏళ్లలోపు పిల్లలు ఉన్న పేరెంట్స్‌కు సౌదీ గుడ్‌న్యూస్.. ఇకపై..

ABN , First Publish Date - 2022-08-28T17:44:07+05:30 IST

రెగ్యులర్ రెసిడెన్సీ కలిగి ఉండి, 18ఏళ్లలోపు పిల్లలు ఉన్న పేరెంట్స్‌కు సౌదీ అరేబియా (Saudi Arabia) జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) గుడ్‌న్యూస్ చెప్పింది.

Saudi Arabia: 18ఏళ్లలోపు పిల్లలు ఉన్న పేరెంట్స్‌కు సౌదీ గుడ్‌న్యూస్.. ఇకపై..

రియాద్: రెగ్యులర్ రెసిడెన్సీ కలిగి ఉండి, 18ఏళ్లలోపు పిల్లలు ఉన్న పేరెంట్స్‌కు సౌదీ అరేబియా (Saudi Arabia) జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ కేటగిరీకి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల విజిట్ వీసాలను ఇకపై ముకీమ్ గుర్తింపు కార్డుకు(ఇకామా) మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, నివాస ఇకామా గడువు ముగిస్తే మాత్రం సందర్శకుల విజిట్ వీసాను (Visit visa) పొడిగించే వీలుండదని స్పష్టం చేసింది. అలాగే కుటుంబ విజిట్ వీసా గడువు పొడిగింపు కూడా 6నెలలకు మించకూడదని జవాజత్ పేర్కొంది. అంతేగాక విజిట్ వీసా గడువు ముగిసిన మూడు రోజుల తర్వాత పొడిగించకుంటే మాత్రం మొత్తం జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక విజిట్ వీసా జారీ చేయడం, ఆమోదించడం వంటి విషయాల్లో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తెలియజేసింది. విజిట్ వీసా జారీచేసే వారు మాత్రం తప్పనిసరిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించాలని జవాజత్ సూచించింది. 

Updated Date - 2022-08-28T17:44:07+05:30 IST