Satyendra Kumar Jain కేసు: ఈడీ దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యం

ABN , First Publish Date - 2022-06-07T22:16:14+05:30 IST

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra jain) నివాసంతో పాటు సహచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి.

Satyendra Kumar Jain కేసు: ఈడీ దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra jain) నివాసంతో పాటు సహచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి. మొత్తం 2.82 కోట్ల రూపాయల నగదు, 1.8 కిలోల 133 బంగారం బిస్కట్లు, నాణేలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. 






హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో మే 30న అరెస్టైన సత్యేంద్ర జైన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నాడు. ఇదే కేసులో సత్యేంద్ర జైన్‌, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్ర జైన్‌పై సీబీఐ 2017లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది. 


మరోవైపు సత్యేంద్ర జైన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వెనకేసుకొచ్చారు. సత్యేంద్ర జైన్‌కు పద్మ విభూషణ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-07T22:16:14+05:30 IST