ఢిల్లీ మంత్రి Satyendra Jain కు బెయిల్ నిరాకరణ

ABN , First Publish Date - 2022-06-18T20:51:40+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఉపశమనం..

ఢిల్లీ మంత్రి Satyendra Jain కు బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendra jain)కు ఉపశమనం లభించలేదు. బెయిల్ కోసం ఆయన చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ కోర్టు శనివారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి ఇది సరైన సమయం కాదని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ పేర్కొంటూ బెయిల్ దరఖాస్తును కొట్టివేశారు.


ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింక్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద సత్యేంద్ర జైన్‌ను ఈడీ ఇటీవల కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడిషయల్ కస్టడీలో ఉన్నారు. జైన్‌ను ఈడీ కస్టడీలో తీసుకోవడంతో ఆయనకు చెందిన మంత్రిత్వ శాఖలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేజ్రీవాల్ ప్రభుత్వం కేటాయించింది.

Updated Date - 2022-06-18T20:51:40+05:30 IST