తిరుమల: బీజేపీ నేతలు పగటి వేషగాలుగా ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం తెల్లవారు జామున తిరమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలలోని ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతి స్థిమితం మీద సందేహం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తీరును మార్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.