Jun 21 2021 @ 15:03PM

‘సత్యమేవ జయతే2’ షూటింగ్ పూర్తి

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సత్యమేవ జయతే 2’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అనుకున్నట్లు చిత్రీకరణ పూర్తయితే సినిమాను మే 13న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా కొంత షూటింగ్ పూర్తి కాలేదు. రీసెంట్‌గా షూటింగుల‌కు ప‌రిమితులు ల‌భించ‌గానే షూటింగును స్టార్ట్ చేసిన ఈ యూనిట్ రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇందులో జాన్ అబ్ర‌హం ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. దివ్యా కోస్లా కుమార్ హీరోయిన్‌. మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మ‌నోజ్ బాజ్‌పాయ్‌, అమైరా ద‌స్తూర్ న‌టిస్తున్నారు.