చిన్న తప్పుకు చిత్రహింసలు పెట్టి చంపేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై సత్యకుమార్ ఫైర్

ABN , First Publish Date - 2022-10-04T16:56:20+05:30 IST

రెండు రోజుల క్రితం కాకినాడ (Kakinada)లో జరిగిన ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ (Y. Satya kumar) స్పందించారు.

చిన్న తప్పుకు చిత్రహింసలు పెట్టి చంపేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై సత్యకుమార్ ఫైర్

Delhi : రెండు రోజుల క్రితం కాకినాడ (Kakinada)లో జరిగిన ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ (Y. Satya kumar) స్పందించారు. నాటు సారా కాశాడని గౌడ్ సమాజానికి చెందిన బొంతు రమణ (Bonthu Ramana)ను పోలీసులు కొట్టిచంపడం అమానుషమని ట్విటర్ వేదికగా సత్య కుమార్ పేర్కొన్నారు. చిన్న తప్పుకు పిడి యాక్ట్ (PD Act0 కింద బుక్ చేసి వారం రోజులపాటు చిత్రహింసలకు గురి చేసి చంపేస్తారా? అని ఏపీ ప్రభుత్వం (AP Government)పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాటు సారా కాసాడని గౌడ్ సమాజానికి చెందిన బొంతు రమణను పోలీసులు కొట్టిచంపడం అమానుషం. చిన్న తప్పుకు పిడి యాక్ట్ కింద బుక్ చేసి వారం రోజులపాటు చిత్రహింసలకు గురి చేసి చంపేస్తారా? మరి రాష్ట్రమంతా చీప్ లిక్కర్‌ను ఏరులై పారిస్తున్న వారి సంగతేమిటి? మీకో న్యాయం పేద బీసీలకు ఒక న్యాయమా? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే! రోడ్డున పడిన ఆ కుటుంబాన్ని ఆదుకుని, 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి, బీసీల సాధికారత గురించి గొప్పలు చెప్పుకునే సీఎం వైస్ జగన్ గారు (CM YS Jagan) తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆ పేద కుటుంబానికి అండగా నిలబడిన బీజేపీ ఆంధ్ర కాకినాడ నాయకులకు వందనాలు’’ అని సత్యకుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 




Updated Date - 2022-10-04T16:56:20+05:30 IST