Abn logo
Sep 22 2021 @ 00:38AM

సత్యాగ్రహ్‌ సే స్వచ్ఛాగ్రహ్‌ రథయాత్ర

రథయాత్రను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 21: 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా సత్యాగ్రహ్‌ సే స్వచ్ఛాగ్రహ్‌ రథయాత్ర పక్షోత్సవాలను కలెక్టర్‌ నారాయణరెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్‌ శాఖ ఆదేశాల మేర కు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో స్వచ్ఛతా హి సేవా పక్షోత్సవాలు ఈనెల 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ గ్రా మం, మండలం, జిల్లా స్థాయిలో కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛత, శ్రమదా నం, సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ నిర్మూళన, స్వచ్ఛత జాగృతి యాత్రలు తడి, పొడి చెత్త నిర్వహణ, మరుగుదొడ్ల వాడకంపై అవగాహన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రతీ గ్రామంలో గ్రామసభలు నిర్వహిస్తారని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో రథయాత్ర కొనసాగేవిధంగా చర్యలు చేపట్టాల ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈగో గోవింద్‌, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, డీపీవో జయసుధ పాల్గొన్నారు.