Abn logo
Oct 19 2020 @ 01:02AM

సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

Kaakateeya

సత్యదేవ్‌ హీరోగా ‘తిమ్మరుసు’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అన్నది ఉపశీర్షిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ కోనేరు, సృజన్‌ నిర్మాతలు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. నిర్మాతలు మాట్లాడుతూ  ‘‘వైవిధ్యభరిత చిత్రాలు చేసే సత్యదేవ్‌కు కొత్త జానర్‌ చిత్రమిది. ఈ నెల 21 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా షూటింగ్‌ చేసి సినిమా పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు. బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర.

Advertisement
Advertisement
Advertisement