గురుకుల పాఠశాలలో ఉన్నతాధికారుల విచారణ

ABN , First Publish Date - 2022-09-27T06:14:59+05:30 IST

సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్‌, ఎలక్ర్టీషియన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పవన్‌కుమార్‌ తెలిపారు.

గురుకుల పాఠశాలలో ఉన్నతాధికారుల విచారణ
గురుకుల పాఠశాలలో విచారణ జరుపుతున్న కార్యదర్శి పవన్‌కుమార్‌

బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగులపై వేటు

రెండురోజుల్లో ప్రిన్సిపాల్‌పై చర్యలు


సత్తెనపల్లిరూరల్‌, సెప్టెంబరు26:  సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల పట్ల  అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్‌, ఎలక్ర్టీషియన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పవన్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన జాయింట్‌ కార్యదర్శి సంజీవరావు, డిప్యూటీ కార్యదర్శి సీతామహాలక్ష్మితో కలిసి విచారణ జరిపారు. ప్రిన్సిపాల్‌ భర్త,  అటెండర్‌, ఎలక్ట్రీషియన్లు మద్యం సేవించి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 24వ తేదీన విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద, విలేకరుల ఎదుట వాపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.  తక్షణలో పాఠశాలలో గదిని ఖాళీ చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్‌ అటెండర్‌ నాయక్‌ను, ఎలక్ట్రీషియన్‌ శ్రీనివాసరావును సస్పెండ్‌చేసినట్లు ప్రకటించారు. ప్రిన్సిపాల్‌పై రెండురోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వారి వెంట ఆర్డీవో రాజకుమారి, తహసీల్దారు నగేష్‌ ఉన్నారు. 

Updated Date - 2022-09-27T06:14:59+05:30 IST