పల్నాడు: సత్తెనపల్లిలో యువతి గొంతు కోసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా ఫాతిమాతో తులసీరామ్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఫాతిమా కోరడంతో గొంతుకోసి తులసీరామ్ పరారైనాడు, చెక్‌పోస్ట్ దగ్గర తులసీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.