సంక్రాంతి సందర్భంగా పలువురు హీరోలు తమ అభిమానులకు సర్ప్రైజ్లు అందించారు. తమ కొత్త సినిమా అప్డేట్లు ఇచ్చారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న `ఆర్ఆర్ఆర్` యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` యూనిట్‌పై సెటైర్లు వేస్తున్నారు.
`ఆర్ఆర్ఆర్` యూనిట్‌పై ఓ అభిమాని వేసిన సెటైర్ సాటి అభిమానులనే కాదు.. ``ఆర్ఆర్ఆర్` టీమ్‌ను కూడా ఆకట్టుకుంది. `రాజమౌళి కుటీరం` పేరుతో వేసిన కార్టూన్లో రామ్‌చరణ్, ఎన్టీయార్ నిల్చుని ఉండగా.. ఇద్దరు మహిళలు ముగ్గులు వేస్తుంటారు. `అక్కా! సినిమా రిలీజ్ ఎప్పుడు` అని చెల్లి ప్రశ్నించగా.. `తప్పమ్మా! తెలియనివి అడగకూడద`ని అక్క సమాధానమిస్తుంది. ఈ సెటైర్‌పై `ఆర్ఆర్ఆర్` టీమ్ స్పందించింది. `సృజనాత్మకతతో కొట్టారు. చాలా నచ్చింది. హ్యాపీ సంక్రాంతి` అని రిప్లై ఇచ్చింది.