ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ

ABN , First Publish Date - 2022-08-12T05:59:19+05:30 IST

భగవాన సత్యసాయిబాబా గిరిప్రదక్షిణను గురువారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు, గణేష్‌ గేట్‌వద్ద సత్యసాయి రథాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు




పుట్టపర్తిరూరల్‌, ఆగస్టు 11: భగవాన సత్యసాయిబాబా గిరిప్రదక్షిణను గురువారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు, గణేష్‌ గేట్‌వద్ద సత్యసాయి రథాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.  అనంతరం భక్తులు  రథాన్ని లాగుతూ భక్తిగీతాలు అలపిస్తూ గిరిప్రదక్షిణ చేశారు. గిరిప్రదక్షిణ గోకులం, ఎనుమలపల్లికూడలి, పెట్రోలు బంకు, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధి, సత్యమ్య ఆలయం, గోపురంరోడ్డుమీదుగా సాగి తిరిగి గణేష్‌ గేట్‌వద్దకు చేరుకుంది. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

Updated Date - 2022-08-12T05:59:19+05:30 IST