Ukrainian నగరాల్లో సంభవించిన యుద్ధ విధ్వంసం...ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

ABN , First Publish Date - 2022-03-17T14:12:26+05:30 IST

రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ దేశంలోని నగరాల్లో సంభవించిన విధ్వంసం మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెలుగుచూసింది....

Ukrainian నగరాల్లో సంభవించిన యుద్ధ విధ్వంసం...ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

 కైవ్: రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ దేశంలోని నగరాల్లో సంభవించిన విధ్వంసం మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో వెలుగుచూసింది.సుమీ, చెర్నిహివ్, ఖార్కివ్‌లతో సహా పలు ఉక్రేనియన్ నగరాల్లో నివాస, పౌర మౌలిక సదుపాయాలపై రష్యా క్షిపణుల దాడితో గణనీయమైన నష్టం వాటిల్లింది. రష్యా సైనిక దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను మారియుపోల్ శివార్లలో సామూహికంగా ఖననం చేసిన చిత్రం తాజాగా వెలుగుచూసింది.సుమీ నగరంలోని నివాస ప్రాంతం షెల్లింగ్‌ దాడులతో ధ్వంసమైంది.ఉపగ్రహ చిత్రాల్లో రష్యన్ స్వీయ-చోదక ఫిరంగి, బహుళ రాకెట్ లాంచర్లు చెర్నిహివ్ నగర శివార్లలో మోహరించినట్లు చూపాయి.


మార్చి 14 నాటి రెండు ఉపగ్రహ చిత్రాలు మారియుపోల్‌ను చూపాయి. ఇందులో మారియుపోల్ డ్రామా థియేటర్‌పై మార్చి 16న బాంబు దాడి జరిగింది.మైకోలైవ్‌లోని కేన్సర్ ఆసుపత్రిని రష్యా షెల్‌లు దెబ్బతీశాయని ఉక్రెయిన్ పేర్కొంది.మారియుపోల్ డ్రామా థియేటర్ ను బాంబు దాడికి ముందు వందలాది ఉక్రేనియన్లకు ఆశ్రయంగా ఉపయోగించారు. 

Updated Date - 2022-03-17T14:12:26+05:30 IST