నేడు రేపూ రాష్ట్రమంతటా వర్షాలే!

ABN , First Publish Date - 2020-07-05T08:34:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీ తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం

నేడు రేపూ రాష్ట్రమంతటా వర్షాలే!

అమరావతి, జులై 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీ  తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం నెలకొంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో శనివారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గోలుగుండలో 45.25, చింతూరులో 36.5, రోలుగుంటలో 30.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కాగా ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7వ తేదీన వర్షసూచన లేదు. 8న దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-07-05T08:34:39+05:30 IST