Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 23 Jan 2022 13:23:49 IST

Satar Maa: డబుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో 'కామెడీ స్టార్స్ ధమాకా'

twitter-iconwatsapp-iconfb-icon
Satar Maa: డబుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో కామెడీ స్టార్స్ ధమాకా

స్టార్ మాలో "కామెడీ స్టార్స్ ధమాకా" పేరుతో ఓ సరికొత్త కామెడి షో మొదలవబోతోంది. ఇప్పటి వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న షోస్ కంటే రెండింతలు ఎంటర్‌టైమెంట్‌ను ప్రేక్షకులకు ఆదివారం మధ్యాహ్నానం అందివ్వబోతున్నారు. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ హంగామా స్టార్ మా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు కొత్తరకమైన మార్పులు చేసింది. కామెడీ స్టార్స్‌లో కనిపించి కడుపుబ్బా నవ్వించిన స్టార్స్‌తో పాటు మరికొంత మంది పాపులర్ కమెడియన్స్ తమ కొత్త స్టైల్స్.. కొత్త టైమింగ్‌తో ఇప్పుడు మరింత రెట్టింపు స్థాయిలో కామెడీ అందించబోతున్నారు. ఈ కార్యక్రమలో మెగా బ్రదర్ నాగబాబు, ప్రముఖ కొరియో గ్రాఫర్ వి జె శేఖర్ మాస్టర్ సందడి చేయబోతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement