శశికళ మా పార్టీ సభ్యురాలు కాదు : అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2021-06-12T22:57:07+05:30 IST

సీఎం జయలలిత నిచ్చెళి శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై అన్నాడీఎంకే

శశికళ మా పార్టీ సభ్యురాలు కాదు : అన్నాడీఎంకే

చెన్నై : సీఎం జయలలిత నిచ్చెళి శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై అన్నాడీఎంకే స్పందించింది. అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నియన్ మాట్లాడుతూ.. శశికళ అన్నాడీఎంకే సభ్యురాలే కాదని స్పష్టం చేశారు. ఆమె టీవీవీ దినకరన్‌కు సంబంధించిన గ్రూప్ అని తెలిపారు. అన్నాడీఎంకేను తిరిగి గాడిలో పెతానని చెప్పే నైతిక హక్కు ఆమెకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. శశికళ గురించి ఎవరైతే మాట్లాడుతారో, వారు అన్నాడీఎంకేకు సంబంధించిన వారు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని పొన్నియన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా శశికళ ఆడియో టేపులు లీక్ అవుతున్నాయి. అతి త్వరలోనే తాను అన్నాడీఎంకేలోకి వస్తానని, పూర్తిగా ప్రక్షాళన చేస్తానన్న ఆడియో విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే నేత పై వ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2021-06-12T22:57:07+05:30 IST