Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ‘శశి’ విద్యార్థులు

ఉండ్రాజవరం, నవంబరు  3: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తమ విద్యార్థులు ఎంపికైనట్లు శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌  తెలిపారు. ఈ నెల 2న కామవరపు కోట మండలం తూర్పు యడవల్లిలో జరిగిన జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో  ప్రతిభ కనపర్చి ఈ నెల 17న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం. తనుశ్రీ, కె. దివ్యశ్రీ, ఎన్‌. కామేశ్వరి, ఎం. ఉదయ్‌ ఎంపికైనట్టు చెప్పారు. అలాగే జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన లాంగ్‌ జంప్‌లో అండర్‌–16 విభాగంలో ఎ. సిద్ధార్థ, అండర్‌–14లో కె. చైతన్యగుప్త, షాట్‌పుట్‌లో అండర్‌–14లో  కె. హర్షవర్ధన్‌ ఎంపికైనట్లు తెలిపారు. విజేతలైన విద్యార్థులను,  వ్యాయామ ఉపాధ్యాయులను రవికుమార్‌తోపాటు వైస్‌ఛైర్మన్‌ లక్ష్మిసుప్రియ అభినందించారు. 

Advertisement
Advertisement