Abn logo
Jul 8 2020 @ 16:14PM

ప్రభాస్ సినిమాలో ఎయిర్ టెల్ బ్యూటీ..!

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ 20వ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ప్ర‌స్తుతం షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో యంగ్ బ్యూటీ కూడా న‌టిస్తోంది. ఆమె ఎవ‌రో కాదు.. ఎయిర్ టెల్ యాడ్‌లో న‌టించి ఆక‌ట్టుకున్న శాషా చ‌త్రి. ఇంత‌కు ముందు ఈ అమ్మ‌డు ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో శాషా చత్రి పాత్ర‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. శుక్ర‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

Advertisement
Advertisement
Advertisement