సర్వోదయ రైతు నాయకుడు నాగభూషణం మృతి

ABN , First Publish Date - 2021-05-09T06:32:56+05:30 IST

సీనియర్‌ హోమియో వైద్యుడు, సర్వోదయ రైతు సంఘం ఆధ్యక్షుడు డాక్టర్‌ నాగభూషణం (90) శనివారం మృతిచెందారు.

సర్వోదయ రైతు నాయకుడు నాగభూషణం మృతి

 నరసాపురం టౌన్‌/ మొగల్తూరు, మే 8: సీనియర్‌ హోమియో వైద్యుడు, సర్వోదయ రైతు సంఘం ఆధ్యక్షుడు డాక్టర్‌ నాగభూషణం (90) శనివారం మృతిచెందారు.కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్నారు. రైతు సమస్య లపై నాగభూషణం అనేక పోరాటాలు చేశారు.ఆయన మృతికి ఎమ్మెల్యే ప్రసా దరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవ నాయుడు, జానకిరామ్‌, డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌ పొత్తూరి రామ రాజు, కొప్పాడ రవి, నెక్కంటి సుబ్బారావు, మృత్యుంజయ, పీఎంపీలు మెండి రాజేష్‌ కుమార్‌, మెట్ల రాంబాబు, కె.వరదరాజు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-05-09T06:32:56+05:30 IST