మాట్లాడుతున్న పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు
గూడూరు, సనవరి 21: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ఎన్‌ఎఫ్‌పీఈ నాయకులు తెలిపారు. శుక్రవారం స్థానిక పోస్టాఫీసు వద్ద ఎన్‌ఎఫ్‌పీఈ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గోవిందనాయక్, హేమలత, సీఎస్‌రాజు, హరీష్‌కుమార్, మల్లికార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.