రాజమండ్రిలో ప్రారంభమైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కొత్త షెడ్యూల్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకుడు.  రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా  షూటింగ్  నేడు (అక్టోబర్ 24) రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం షూటింగ్‌ను చిత్రయూనిట్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ లో  ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. దీంతో దాదాపు టాకీ పార్ట్ పూర్తి కానుంది. దసరాకి విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’  ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శర్వానంద్ ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. రష్మిక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. టైటిల్‌ను బట్టి చూస్తే  ఈ చిత్రం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా శర్వానంద్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి. 

Advertisement