నేటి నుంచి ముక్కంటి ఆలయంలో సర్వకైంకర్య, తులాభార సేవలు

ABN , First Publish Date - 2021-04-13T07:07:26+05:30 IST

ఉగాది నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయంలో సర్వకైంకర్య సేవ, తులాభార సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేటి నుంచి ముక్కంటి ఆలయంలో సర్వకైంకర్య, తులాభార సేవలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 12: ఉగాది నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయంలో సర్వకైంకర్య సేవ, తులాభార సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్వకైంకర్య సేవకు రూ.5,116గా టికెట్‌ ధర నిర్ణయించగా, ఇద్దరిని అనుమతిస్తామన్నారు. ఆ మేరకు.. గోపూజ, సుప్రభాతం, రుద్రాభిషేకం, అర్చన, చండీహోమం, రుద్రహోమం, కల్యాణం, హారతి, ఏకాంతసేవల్లో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. సర్వకైంకర్య సేవలో పాల్గొనే భక్తులకు ఉచిత బస, గీతామకరందం, కుంకుమ, శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యం పుస్తకాలు, ప్రసాదం అందజేయనున్నట్లు ఈవో తెలిపారు. 

Updated Date - 2021-04-13T07:07:26+05:30 IST