పేదల అభ్యున్నతికి సర్వాయి పాపన్నగౌడ్‌ కృషి

ABN , First Publish Date - 2022-08-19T04:47:42+05:30 IST

నిరుపేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు.

పేదల అభ్యున్నతికి సర్వాయి పాపన్నగౌడ్‌  కృషి
మంచిర్యాలలో సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్రపటం వద్ద నివాలులర్పిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ




-  కలెక్టర్‌ భారతి హోళికేరి

- జిల్లా వ్యాప్తంగా నివాళులు అర్పించిన నాయకులు 

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  18:  నిరుపేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో సర్వాయి పాపన్న జయంతిని గౌడ  సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ సర్దార్‌ పాపన్నగౌడ్‌  నిజాం నవాబుల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడని చెప్పారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, పీఏసీఎస్‌ పల్లె భూమేష్‌, నాయకులు మహేందర్‌గౌడ్‌, జగన్‌, లెక్కల విజయ్‌, కర్రె లచ్చన్న, శ్రీధర్‌గౌడ్‌, హరీష్‌, శ్రీను, రాజు, తదితరులు పాల్గొన్నారు.   జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు హాల్‌లో  నిర్వహించిన పాపన్నగౌడ్‌ జయంతి వేడుకల్లో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డా. నీలకంటేశ్వర్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు నరేందర్‌, రాజేషం గౌడ్‌, నరేష్‌, రాజేష్‌, కనకరాజు, రమేష్‌, ప్రదీప్‌, తదితరులు పాల్గొన్నారు.   జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు గౌడ సంఘం మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు దూలం రాజేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మహేందర్‌, శ్రీనివాస్‌, హరీష్‌గౌడ్‌, వెంకటేష్‌, కనకయ్య, శ్రీకాంత్‌, సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.  

ఏసీసీ: తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న  జయంతి వేడుకలను పట్టణంలోని బస్టాండ్‌ ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌ ముఖ్య అథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ జాగృతి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌, సర్వాయి పాపన్న మోకు దెబ్బ, గౌడ సంక్షేమ సంఘం అద్యక్షుడు దూలం రాజేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, మెట్టల రమేష్‌, విష్ణు, సదానందం, బోరిగం రాజారాం, అత్తి సరోజ, జోగుల శ్రీదేవి, కర్రె లచ్చన్న, తులా మధుసూదన్‌, రాంప్రకాష్‌, లక్ష్మణ్‌, మంచర్ల సదానందం, కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  పట్టణంలోని ఐబీ చౌరస్తాలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్‌ నందిపాటి రాజు, మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్‌సింగ్‌, బీసీ సంఘం ఐక్య వేదిక కన్వీనర్‌ గుమ్ముల శ్రీనివాస్‌, విష్ణు, నగేష్‌, శేఖర్‌, అశోక్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.  

దండేపల్లి: మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు బండి రవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జన్నారం: మండల కేంద్రంలో గౌడ జనుల హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ వేడుకలు నిర్వహించారు. కవ్వాల గ్రామంలో పాపన్నగౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఆయా కార్యక్రమల్లో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజారాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌, నాయకులు రాజుగౌడ్‌, నర్సగౌడ్‌, సత్యగౌడ్‌, గంగాధర్‌గౌడ్‌, మున్వర్‌ , భరత్‌కుమార్‌, చందు, ప్రభుదాస్‌, రాజేశ్వర్‌, పసివుల్లా, ఇందయ్య, దేవయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. 

చెన్నూరురూరల్‌: మండలంలోని కిష్టంపేట గ్రామంలో సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ కులస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

చెన్నూరు:  గౌడ సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగన్నాధ స్వామి ఆలయ సమీపంలో పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చెన్నూరు గౌడ సంఘం అధ్యక్షుడు కుర్మ అశోక్‌గౌడ్‌,  నాయకులు ముత్యాల శ్రీధర్‌గౌడ్‌, సంపత్‌గౌడ్‌, మల్లేశంగౌడ్‌,  సత్యనారాయణగౌడ్‌, మోహన్‌గౌడ్‌, రాజగౌడ్‌, నర్సగౌడ్‌, రఘుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రి టౌన్‌: పట్టణంలో పాపన్నగౌడ్‌ చిత్రపటానికి నాయకులు  పూల మాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో వెంకటేశ్వర్‌గౌడ్‌, దూలం కనకయ్య గౌడ్‌, భా స్కర్‌గౌడ్‌, సత్యనారాయణ, లక్ష్మిరాజం గౌడ్‌, రాచర్ల రవి, నరేష్‌ పాల్గొన్నారు.  

కోటపల్లి: మండల కేంద్రంలో  సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్‌, సర్వాయిపాపన్నమోకుదెబ్బగౌడ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు లక్ష్మణ్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు ముత్యాల సంపత్‌గౌడ్‌  పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు మొండగౌడ్‌, ప్రధాన కార్యదర్శి సమ్మగౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు సంతోష్‌గౌడ్‌, పెద్దపోలు సాంబగౌడ్‌, భీమగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట: మండలంలోని కొండాపూర్‌ యాప వద్ద పాపన్నగౌడ్‌ చిత్రపటానికి గౌడ సంఘం  జిల్లా నాయకుడు పల్లె మల్లయ్యగౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో నాయకులు తాటిపాముల శంకర్‌గౌడ్‌, కోడూరి విద్యాసాగర్‌, నర్సింగం, శ్రీనివాస్‌, గణేశ్‌, రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నెన్నెల: మండల కేంద్రంలో సర్వాయి పాపన్నగౌడ్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో  గౌడ సంఘం మండల అఽధ్యక్షుడు సాంబ మూర్తిగౌడ్‌, నాయకులు స్వామిగౌడ్‌, పెంటాగౌడ్‌, పూదరి సత్యనారాయణగౌడ్‌, నాగేశ్వర్‌గౌడ్‌, మల్లాగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సునీల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T04:47:42+05:30 IST